ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్యే అంజాద్ బాషా స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచారని, అలాంటి వారికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని అన్నారు. ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష పార్టీ చేస్తున్న పోరాటానికి అధికార పార్టీ నేతలు మద్దతు ఇవ్వాలని కోరారు. కలిసికట్టుగా పోరాడితే కేంద్రం కచ్చితంగా దిగొస్తుందన్నారు.