ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఘాటు లేఖ సంధించారు. ‘ మీరు మేధావి అని అందరూ భావించారు. కానీ మీ మేధావితనంతో మీకు కావాల్సిన వారికి, మీ కుటుంబానికి కోట్ల రూపాయలు దోచిపెట్టారని అర్ధమైంది. మా జాతికి ఇచ్చిన హమీలను అమలు చేయమని అడిగితే అన్నదమ్ముల్లాంటి మా సోదరులతో తిట్టించి పబ్బం గడుపుకుంటున్నారు. మా జాతిలో కొందరి ఆర్ధిక మూలలను దెబ్బతీశారు. కొందరిపై తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్లు తెరిపించారు.’ అని లేఖ ద్వారా విమర్శించారు.