ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒకరి కాలు మరొకరికి తగలిందని మొదలైన చిన్న గొడవ చివరికి ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. అలహాబాద్‌లోని కాలికా రెస్టారెంట్‌లో గత శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దిలీప్ అనే లా సెకండియర్ విద్యార్థి తన స్నేహితులతో డిన్నర్ చేయడానికి కాలికా రెస్టారెంట్‌కు వెళ్లాడు. విజయ్ శంకర్ అనే వ్యక్తికి దిలీప్ కాలు తగిలిందన్న విషయంలో చిన్నగొడవ మెదలైంది. డిన్నర్ అనంతరం మరో సారి వీరి మధ్య గొడవ జరగడంతో రెస్టారెంట్ బయట కొట్టుకున్నారు. ఈ సమయంలో రెస్టారెంట్ వేయిటర్ మున్నా చౌహన్ ఐరన్ రాడ్‌తో దిలీప్‌పై దాడి చేశాడు. దీంతో అతను కుప్పుకూలిపోవడంతో వెంటనే బైక్‌పై ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
Feb 12 2018 12:11 PM | Updated on Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement