రమణ వర్సెస్‌ రేవంత్‌ రెడ్డి | L. Ramana letter to chandrababu over revanth reddy issue | Sakshi
Sakshi News home page

రమణ వర్సెస్‌ రేవంత్‌ రెడ్డి

Oct 25 2017 2:30 PM | Updated on Mar 22 2024 11:19 AM

తెలంగాణ టీడీపీలో రేవంత్‌ రెడ్డి వివాదం ముదిరి పాకాన పడుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ లేఖ రాశారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌ పదవుల నుంచి రేవంత్‌ రెడ్డిని తక్షణమే తొలగించాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు...ఈ నెల 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రేపు ఉదయం 11 గంటలకు టీడీఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు రేవంత్‌ రెడ్డి ఓ ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ఎల్‌.రమణ సహా ముఖ్యనేతలను ఆయన సమావేశానికి ఆహ్వానించారు. అయితే ఆ సమావేశం నిర్వహించరాదని ఎల్‌. రమణ ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిని ఆదేశించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement