ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నోటి వెంట అబద్ధాలు మాత్రమే వస్తాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. 2013 కాకినాడ ఎన్నికల సభలో అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రెండు సార్లు చార్జీలు పెంచారన్నారు. దీని ప్రకారం ప్రజలపై రూ.4,700 కోట్లు భారం మోపారన్నారు.