ప్రాణం తీసిన పబ్‌జీ

పబ్‌జీ గేమ్‌ పద్మ వ్యూహానికి మరో యువకుడు బలయ్యాడు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారంపల్లికి చెందిన సాగర్‌ అనే 20 ఏళ్ల యువకుడు పబ్‌జీ గేమ్‌ పిచ్చితో ప్రాణాలు కోల్పోయాడు. టైంపాస్‌గా ఆడటం ప్రారంభించిన సాగర్‌కు ఈ గేమ్‌ వ్యసనంలా మారింది. గత 45 రోజులుగా పదేపదే ఈ గేమ్‌ ఆడటంతో అతని మెడనరాలు పట్టేసి ఆరోగ్యం విషమించింది. దీంతో​ కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. గత 5 రోజులుగా వైద్యులు సాగర్‌కు చికిత్స అందించగా.. నరాలు పూర్తిగా దెబ్బతినడంతో గురువారం తుదిశ్వాస విడిచాడు. ఇక పబ్‌జీ గేమ్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సాగర్‌ను చూపిస్తూ.. అతని స్నేహితులు ఓ అవార్‌నెస్‌ వీడియోను కూడా రూపొందించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top