కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ ఆధికారుల సోదాలు ముగిశాయి. గురువారం ఉదయం గంటలకు మొదలైన సోదాలు శనివారం తెల్లవారుజామున 2:30 గంటల వరకు కొనసాగాయి. దాదాపు 44 గంటల పాటు కొనసాగిన తనిఖీల్లో రేవంత్‌రెడ్డి, అతని భార్య గీతను అధికారులు విచారించారు. కాగా, రేవంత్ ఇంటినుంచి పలు కీలక డాక్యుమెంట్లు ఐటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.