ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా ఎక్కువ కాలం పాటు సెలవులు పెట్టిన ఉద్యోగులపై దేశీయ రైల్వే చర్యలు తీసుకోబోతుంది. వారిని సర్వీసు నుంచి తొలగించేందుకు సిద్ధమవుతోంది. అనధికారికంగా సెలవులు పెట్టిన వారు 13వేల మందికి పైగా ఉన్నారని ఇటీవల రైల్వే గుర్తించింది. ఆర్గనైజేషన్ పనితీరును మెరుగుపరచడానికి రైల్వే ఓ డ్రైవ్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ డ్రైవ్ ద్వారా ఉద్యోగుల్లో నిజాయితీని, శ్రద్ధను పెంచడం వంటివి చేస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులపై తీసుకోబోయే ఈ చర్యలు కూడా ఈ క్యాంపెయిన్ కిందవేనని రైల్వే పేర్కొంది.