అది ఒక క్యాచ్‌గా కేఎల్ రాహుల్ పట్టుకుని ఉంటే అతని కెరీర్‌లోనే చిరస్మరణీయంగా మిగిలిపోయేది. అదే సమయంలో సెన్సేషనల్ క్యాచ్ కూడా అయ్యేది. కానీ అది జస్ట్ మిస్ అయ్యింది. వెస్టిండీస్‌తో ఇక్కడ బారాబతి స్టేడియంలో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా ఎగిరి బంతిని పట్టుకున్నాడు. కానీ ఆ సమయంలో బంతిని బౌండరీ బయటకు విసరడంలో విఫలం కావడంతో అది సిక్స్ అయ్యింది. కానీ రాహుల్ ఫీల్డింగ్ మాత్రం హైలైట్‌గా నిలిచింది.