కుప్పకూలిన జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు | Hundreds missing in Laos after hydropower dam collapses | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు

Jul 25 2018 8:05 AM | Updated on Mar 21 2024 7:46 PM

లావోస్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు (హైడ్రో పవర్‌ డ్యామ్‌) ఒక్కసారిగా కుప్పకూలిపోయి వందలాది మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేది ఇంకా లెక్క తేలలేదు. అయితే మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 6,600 మంది నిర్వాసితులయ్యారు.

ఆగ్నేయ లావోస్‌లోని అటాపీ ప్రావిన్స్‌ సనామ్‌క్సేయ్‌ జిల్లాలో నిర్మిస్తున్న జలవిద్యుత్‌ ప్రాజెక్టు సోమవారం అర్ధరాత్రి కుప్పకూలినట్లు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. డ్యామ్‌ కుప్పకూలిన సమయంలో ఒక్కసారిగా 500 కోట్ల క్యూబిక్‌ మీటర్ల నీరు కింద ఉన్న జనావాస ప్రాంతాలపై విరుచుకుపడింది. సుమారు ఆరు గ్రామాలు వరద ధాటికి తుడిచిపెట్టుకు పోయాయని.. ఈ ఘటనలో మృతులు అంచనాకు మించి ఉండొచ్చని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement