బండబూతు తిట్టినా.. భేటీ! | Image for the news result Barack Obama, Rodrigo Duterte meet informally after insults | Sakshi
Sakshi News home page

Sep 9 2016 7:20 AM | Updated on Mar 21 2024 9:52 AM

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్‌ రోడ్రిగో డుటెర్టె బుధవారం అనధికారికంగా భేటీ అయ్యారు. ఆసియన్ సదస్సు గాలా విందు పూర్తయిన తర్వాత వీరు హోల్డింగ్‌ రూమ్‌లో కలిసి చర్చలు జరిపినట్టు ఫిలిఫినో అధికారులు తెలిపారు. నోటి దురుసుతనంతో ఒబామాను ఉద్దేశించి డుటెర్టె అవమానకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒబామా వెలయాలి కొడుకు అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో డుటెర్టెతో మంగళవారం నాటి అధికారిక భేటీని ఒబామా రద్దుచేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement