లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో అపశృతి | Disturbance during Lakshmi Narasimha Swamy Brahmarathotsavam | Sakshi
Sakshi News home page

లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో అపశృతి

Mar 11 2026 12:39 AM | Updated on Mar 11 2026 12:39 AM

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మరథోత్సవంలో మంగళవారం అపశృతి చోటుచేసుకుంది. తిరువీధుల్లో దక్షిణ గోపురం వద్దకు రథం రాగానే.. తోపులాట జరిగి ఆరుగురు భక్తులు రథం ముందు చక్రం కింద ఒకరిపై ఒకరు పడిపోయారు. జాకీ తీసుకొచ్చి రథాన్ని పైకి లేపేవరకూ 40 నిమిషాలపాటు వారు చక్రాల కిందే ఉండి నలిగిపోయి విలవిల్లాడిపోయారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంతో భక్తులు అల్లాడారు. ఇంత జరుగుతున్నా రథం ముందు భాగంలో కూర్చున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఖాద్రీశుడి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకోవడం భక్తుల్లో అలజడి రేపింది.

Advertisement
 
Advertisement
Advertisement