మంగళవారం ఉదయం ముంబైలో ఘోర ప్రమాదం తప్పింది. అంధేరీ రైల్వే స్టేషన్‌ను ఆనుకుని ఉన్న గోఖలే రోడ్ ఓవర్ బ్రిడ్జి కొంత భాగం కుప్పకూలి ట్రాక్‌పై పడిపోయింది. ఆ సమయంలో రైళ్లేవి ఆ మార్గంలో రాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన వెంటనే పశ్చిమ లైన్‌పై రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు.
శకలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం బ్రిడ్జిపై ట్రాఫిక్‌ను నిలిపివేసిన అధికారులు.. సహాయక చర్యలు ప్రారంభించారు. తూర్పు-పశ్చిమ అంధేరీలను కలుపుతూ గోఖలే బ్రిడ్జిని నిర్మించారు. ఘటనలో ఇప్పటిదాకా ఇద్దరికీ గాయాలైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం శకలాల తొలగింపు కొనసాగుతోంది. కాగా, రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వేశాఖ వెంటనే చర్యలు చేపట్టింది.
ముంబైలో భారీ వర్షాలు,తప్పిన ప్రమాదం
Jul 3 2018 9:41 AM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement