సాక్షి, హైదరాబాద్ : సోమవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ నగరంలోని అనేక కాలనీలు, రహదారులు, కూడళ్లు నీట మునిగాయి. కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. హుస్సేనీఆలంలో చికెన్ తీసుకెళ్లే ఆటోపైన విద్యుత్ వైరు తెగపడటంతో ఆటో విద్యుత్ ప్రవాహం జరగడం, వాహనం ఐరన్ ఫ్రేమ్ పట్టుకున్న డ్రైవర్ అఫ్సర్ అక్కడికక్కడే మరణించాడు. సాయంత్రం నుంచి మొదలైన వాన రాత్రి 7 గంటల సమయంలో కొంత మేరకు తగ్గుముఖం పట్టినప్పటికీ దాని ప్రభావం ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక అపార్ట్ మెంట్ల సెల్లార్లు నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని అనేక దుకాణాల్లోకి నీరు చేరింది. షాపుల్లోని అనేక వస్తువులు నీటిలో తడిసిన కారణంగా చాలా మందికి భారీ నష్టమే జరిగింది.
Oct 2 2017 9:09 PM | Updated on Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement