క్యూలైన్‌లో ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం | Heavy crowds throng Tirumala for Vaikunta Ekadasi | Sakshi
Sakshi News home page

క్యూలైన్‌లో ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం

Dec 30 2017 11:38 AM | Updated on Mar 21 2024 9:09 AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. తిరుగు ప్రయాణంలో బస్సులు చాలక భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ద్వాదశిని పురస్కరించుకుని శనివారం కూడా భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి క్యూలైన్‌లలో బారులు తీరారు. అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో నారాయణగిరి వనంలోని షెడ్లలోనూ వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం రాత్రి నుంచి క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఈరోజు అర్ధరాత్రి వరకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. శనివారంనాటి భక్తులకు రేపు దర్శనభాగ్యం ఉంటుంది. కాగా, తిరుమలలో గదులు దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల కొరతతో భక్తులకు అవస్థలు తప్పడంలేదు. బస్సు రాగానే ఎవరికివారు బస్సులో చోటు కోసం పరుగులు తీస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement