నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ | Filing of nominations starts from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

Mar 18 2019 7:08 AM | Updated on Mar 22 2024 11:29 AM

రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకార పర్వం ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. నోటిఫికేషన్‌ జారీ చేసిన రోజు నుంచే అంటే సోమవారం నుంచే నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. కాగా, నామినేషన్లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్‌ అధికారులు స్వీకరిస్తారు. సెలవు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదని ఈసీ స్పష్టం చేసింది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement