గౌతమి కేసులో డ్రైవర్‌ అరెస్ట్‌ | Driver Lakshmana Rao Arrested In Sri Goutami Murder Case | Sakshi
Sakshi News home page

గౌతమి కేసులో డ్రైవర్‌ అరెస్ట్‌

Jul 6 2018 11:47 AM | Updated on Mar 21 2024 5:20 PM

శ్రీ గౌతమి హత్య కేసులో పోలీసులు మరో అడుగు ముందుకేశారు. కీలక నిందితుల్లో ఒకరైన డ్రైవర్‌ లక్ష్మణ రావును పాలకొల్లు రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నేడు (శుక్రవారం) కోర్టులో హజరుపరచనున్నారు. హత్య జరిగిన రోజు హంతకులతో పాటు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. శ్రీ గౌతమి, పావనిలు నడిపే టూవీలర్‌ను హంతకులకు చూపి, ఫొటోలను అందించినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 26న కూడా నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement