రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలోని కృష్ణా కరకట్ట వద్ద అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక తొలగింపు పనులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం నుంచి కొనసాగుతున్నాయి. సీఆర్‌డీఏ అధికారులు అక్కడికి చేరుకుని తొలగింపు పనులపై సిబ్బందికి సూచనలు చేశారు. బుధవారం రాత్రి సమయానికి దాదాపు 80 శాతానికి పైగా అక్రమ నిర్మాణాన్ని తొలగించారు.