పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా జరుగుతున్న కోడిపందేలపై పోలీసులు దాడులు చేపట్టారు. జిల్లాలోని ఏలూరు డివిజన్, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల్లో శనివారం భారీ ఎత్తున దాడులు నిర్వహించి కోడిపందేల బరులను ధ్వంసం చేశారు. పందేలను నిలువరించేందుకు ఏపీఎస్పీకి చెందిన బెటాలియన్‌ను కేటాయించినట్టు డీఎస్పీ ఈశ్వరరావు తెలిపారు.