రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఓ ఫార్సు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్ చేశారని, అందులోని చిప్‌లను మార్చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) స్థానంలో అనిల్‌చంద్ర పునేఠాను మార్చి ఒక కోవర్టును నియమించారని మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి కేసుల్లో సహ నిందితుడైన వ్యక్తిని సీఎస్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.