అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే చంద్రబాబు నాయుడు ముస్లింలకు మంత్రి పదవి కట్టబెట్టారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఖాదర్ బాషా ఆరోపించారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు ఇప్పుడెందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబుది ముస్లింపై ప్రేమ కాదు డ్రామా అని, మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని విమర్శించారు.