దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. మాస్క్‌లతో వచ్చిన గుర్తు తెలియని అగంతకులు పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఓ బ్యాంక్‌ను దోపిడి చేశారు. వారిని అడ్డుకున్న క్యాషియర్‌ను తుపాకితో కాల్చి చంపారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీ చావ్లా సమీపంలోని కైరా గ్రామ కార్పోరేషన్ బ్యాంకులో శుక్రవారం చోటుచేసుకుంది.మృతి చెందిన క్యాషియర్ సంతోష్‌కుమార్ (45) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఉద్యోగని పోలీసులు తెలిపారు. ఉద్యోగ విరమణ తర్వాత సంతోష్ కార్పోరేషన్ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ దోపిడీలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని, ముఖాలకు మాస్క్‌లు ధరించి, తుపాకులతో దాడి చేశారన్నారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన సంతోష్‌ను షూట్ చేశారన్నారు. బుల్లెట్ అతని చాతిలోకి దూసుకెళ్లిందని, తము సంఘటనాస్థలికి వచ్చేలోపే అగంతకులు తప్పించుకున్నారని, రక్తపుమడుగులో ఉన్న సంతోష్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించామని కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు మీడియాకు తెలిపారు
అందరూ చూస్తుండగానే బ్యాంక్ దోపిడి
Oct 13 2018 10:25 AM | Updated on Mar 20 2024 3:46 PM
Advertisement
Advertisement
Advertisement
