దేశ ప్రధానితో ఓ సెల్ఫీ దిగాలని ఎవరైనా కోరుకుంటారు. ఇక అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడితో ఓ ఫోటో దిగాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఓ కుర్రాడిని అనుకోని అదృష్టం అనూహ్యంగా వరించింది. భారత నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఒకేసారి సెల్ఫీ దిగే అవకాశం వచ్చింది. హ్యూస్టన్‌లో జరిగిన హౌడీమోదీ కార్యక్రమానికి ట్రంప్, మోదీ హాజరైన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరికీ ఆహ్వానం పలికేందుకు కొంతమంది ప్రవాస భారతీయ బాలికలు అక్కడ ఉన్నారు. వీరితో పాటు ఓ బాలుడు కూడా వారితో కలిసి స్వాగతం పలికాడు. రెండు అగ్రరాజ్యాల అధినేతలను ఒక్కసారే ప్రత్యక్షంగా చూసేసరికి అతడికి ఆనందం అంతపట్టలేదు.
వైరల్: ఇద్దరితో సెల్ఫీనా అదృష్టమంటే ఇదే!
Sep 23 2019 9:06 PM | Updated on Sep 23 2019 9:22 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement