మహిళలను వివస్త్రను చేసి బతుకమ్మ ఆడించిన నిజాంను తెలంగాణ సీఎం కేసీఆర్ పొగుడుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మండిపడ్డారు. లక్ష్మణ్ ఆధ్వర్యంలో పలువురు ఆదిలాబాద్ ,తాండూరుకి చెందిన జడ్పీటీసీ, సర్పంచ్‌లు, కార్యకర్తలు శుక్రవారం పార్టీలో చేరారు. విలేకరులతో మాట్లాడుతూ..కేసీఆర్ అవినీతిని ఎండగట్టాలంటే బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. 19 రాష్ట్రాల్లో ఏవిధంగా అధికారంలోకి వచ్చామో తెలంగాణలో కూడా అదేవిధంగా అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రోజూవారీ ప్రక్రియగా బీజేపీలో అనేక మంది చేరుతున్నారని అన్నారు.