ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును పార్టీ అధినాయకత్వం నియమించినట్టు తెలుస్తోంది. ఏపీలో ప్రత్యేక హోదా పోరాటం ముమ్మరం కావడం, బీజేపీకి టీడీపీ కటీఫ్ చెప్పడం.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి నుంచి కంభంపాటి హరిబాబు తప్పుకున్న సంగతి తెలిసిందే. హరిబాబు స్థానంలో ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. శుక్రవారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారు.