వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీ ఈసీ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తనయుడు, సుల్తాన్‌పూర్ సిట్టింగ్ ఎంపీ వరుణ్‌గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మేనకా తరపున సుల్తాన్‌పూర్‌లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకులపై విమర్శలు చేసేక్రమంలో నోరుజారారు.