చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ నేతలు అమరావతి విషయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లోంచి రాజకీయ నేతగా మారారని, కానీ చంద్రబాబు మాత్రం తొలుత రాజకీయ నేతగా ఉండి నెమ్మదిగా నటుడిగా మారారని చురకలంటించారు. చంద్రబాబు ఒక గజ దొంగ అని దేవధర్ వ్యాఖ్యానించారు. జీవీఎల్పై అనవసర ఆరోపణలు చేయవద్దని హితవు పలికారు. వైజాగ్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.