జర్నలిస్టుపై చేయి చేసుకున్న డీసీపీ

వార్తలను కవర్‌ చేయడానికి వెళ్లిన టీవీ జర్నలిస్టు మీద ఓ పోలీస్‌ ఆఫీసర్‌ చేయి చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోమవారం వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. వివరాల్లోకెళితే..  పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య  శనివారం నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి. శనివారం బీజేపీ నేత, బరాక్‌పూర్‌ ఎంపీ అర్జున్‌ సింగ్‌ తలకు గాయమవడంతో ఆదివారం ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎంపీ అర్జున్‌ సింగ్‌ నివాసమైన ‘మజ్దూర్‌ భవన్‌’ లో ప్రవేశించడానికి డీసీపీ అజయ్‌ ఠాకూర్‌ ప్రయత్నించాడు. ఈ సంఘటనలను కవర్‌ చేయడానికి వెళ్లిన స్థానిక టీవీ జర్నలిస్టును డిప్యూటీ కమిషనర్‌ అజయ్‌ ఠాకూర్‌ చెంప మీద కొట్టిన వీడియో బయటపడింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top