పోలవరం పనులపై దృష్టి సారించిన కేంద్రం

జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించి.. పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికిచ్చేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరానికి చేరుకోనుంది. ఈ కమిటీ గురువారం, శుక్రవారాల్లో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తుంది. అనంతరం జలవనరులశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది. ఆ తర్వాత శుక్రవారం రాత్రికి ఢిల్లీకి చేరుకుంటుంది. ప్రాజెక్టు పనుల్లో వాస్తవ స్థితిగతులపై కేంద్రానికి నివేదికిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా పోలవరంపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే వీలుంది. ఈ నేపథ్యంలో కమిటీ పర్యటనకు అత్యంత ప్రాధాన్యమేర్పడింది. పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు కేంద్రమే పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్‌ 7, 2016న దక్కించుకోవడం తెలిసిందే.
 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top