సీఎం జగన్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు

Published Sat, Jan 11 2020 5:22 PM

 వెనుకబడిన బీసీ సామాజిక వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ముందడుగు వేశారు. ఈ మేరకు బీసీ అధ్యయన కమిటీ సభ్యులు, బీసీ మంత్రులు, ఆ సామాజిక వర్గాల ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సీఎం శనివారం సమీక్ష చేపట్టారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీల సమస్యలపై జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.