ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ వ్యభిచారి అని అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, హిందూపురం వైఎస్సార్సీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు శంకర్ నారాయణతో కలిసి విలేకరులతో మాట్లాడారు.