మాజీ ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు! | Anantapur, Ex MLA Y Vishweshwar Reddy Stuck In Lift | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యేకు తప్పిన ముప్పు!

Mar 6 2020 4:10 PM | Updated on Mar 21 2024 11:40 AM

సాక్షి,అనంతపురం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి లిఫ్టులో ఇరుక్కుపోయారు. శ్రీసెవన్ ఫంక్షన్ హాల్‌లో ఈ ఘటన జరిగింది. ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యకర్తలో సమావేశంలో పాల్గొన్న ఆయన.. సమావేశం అనంతరం కిందకు వెళ్తుండగా.. లిఫ్టు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పోలీసులు, కార్యకర్తలు లిఫ్టును ధ్వంసం చేసి విశ్వేశ్వరరెడ్డిని బయటకు తీసుకురావడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement