నా సోదరి చివరి కోరిక అదే | Accused deserve death and nothing less: Unnao rape victim's brother | Sakshi
Sakshi News home page

నా సోదరి చివరి కోరిక అదే

Dec 7 2019 12:14 PM | Updated on Dec 7 2019 12:18 PM

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మృతిపై ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలి హత్యకు ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే కారణమంటూ విపక్షాలు, ప్రజాసంఘాలు, మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వం నిందితులను కాపాడుతోందంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోషల్‌ మీడియా వేదికగా తన గళాన్ని వినిపించారు. బాధిత యువతి కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు. ఈ నేపథ్యంలో వారి వద్ద ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ దేశాన్ని ఎవరూ రక్షించలేరు. మహిళలకు కనీస రక్షణ లేదు. నిందితుల చావును నా సోదరి కోరుకుంటోంది. వారిని వెంటనే శిక్షించాలి. నా సోదరిని హత్యచేసిన ఐదుగురు నిందితులు బతకడానికి అనర్హులు’ అంటూ ఉన్నావ్‌ బాధితురాలి సోదరుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement