తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫెయిల్ అయిన 3.28 లక్షల మంది అభ్యర్థులకు సంబంధించిన రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదని ఇంటర్మీడియెట్ బోర్టు హైకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలు సమర్పించడానికి మరో వారం రోజుల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు ఈ సందర్భంగా కోర్టును కోరారు.