అమెరికా వీసా మోసం కేసులో 130 మంది విద్యార్థులు అరెస్టయ్యారు. వీరిలో అత్యధికులు భారతీయులే. అధికారులు వల పన్ని ఏర్పాటు చేసిన ఫార్మింగ్‌టన్ యూనివర్సిటీ నకిలీదని తెలిసినప్పటికీ అమెరికాలో ఉండి అక్రమంగా ఉద్యోగాలు చేసుకునేందుకే ఈ విద్యార్థులంతా ఆ విశ్వవిద్యాలయంలో చేరారని వలస విభాగం అధికారులు ఆరోపణలు నమోదు చేశారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయమే వీరందరినీ అరెస్టు చేశారు.