student visas
-
ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు
విద్యార్థి వీసాల ముసుగులో అక్రమ వలసల నిరోధానికి ఆస్ట్రేలియా చేపట్టిన చర్యలు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆస్ట్రేలియాలోని అనేక యూనివర్సిటీలు భారత విద్యార్థుల నమోదును నిషేధించాయి. ముఖ్యంగా హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంపై కఠిన నిబంధనలు, పరిమితులు విధించాయి. ఈ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు నకిలీ ధ్రువీకరణ పత్రాలతో వీసాలు పొందుతూ వలస విధానాలకు తూట్లు పొడుస్తున్నారని వర్సిటీలు గుర్తించాయి. నియంత్రణ లేని ఏజెంట్లు, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు, కొందరు ఆపరేటర్లు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని సమాచారం. ఫలితంగా విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రభావం మొత్తం భారతదేశ విద్యార్థులపై పడే ప్రమాదం నెలకొంది. – సాక్షి, అమరావతిప్రతి నాలుగు దరఖాస్తుల్లో ఒకటి నకిలీ..భారత్ నుంచి వచ్చే ప్రతి నాలుగు విద్యార్థి వీసా దరఖాస్తుల్లో ఒకటి నకిలీదిగా ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ధ్రువీకరించింది. భారత్ నుంచి వచ్చే మొత్తం దరఖాస్తుల్లో దాదాపు 24.3 శాతం మోసపూరితమైనవని చెబుతోంది. అంతర్జాతీయ వర్సిటీలకు అతిపెద్ద విద్యార్థి వనరుగా భారత్ ఉంది. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా వర్సిటీల తాజా నిషేధంతో చట్టబద్ధమైన దరఖాస్తుదారుల భవితవ్యం గందరగోళంలో పడుతోంది. ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించకుంటే ద్వైపాక్షిక విద్యా సంబంధాలు ప్రభావితమవుతాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ విద్యార్థుల వీసాలకు సంబంధించి కఠినమైన నిబంధనలను అమలు చేసిన తర్వాత ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న భారత విద్యార్థులకు ఆస్ట్రేలియా వర్సిటీల నిర్ణయం శరాఘాతమేనని నిపుణులు చెబుతున్నారు.వలసలను తగ్గించేందుకు..గత ఏడాది రికార్డు స్థాయిలో వలసలను నియంత్రించే యత్నంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం వర్సిటీలను హెచ్చరించింది. విద్యార్థి వీసా మంజూరుకు పొదుపు డిపాజిట్ మొత్తాన్నీ పెంచింది. గత ఏడాది మే 10 నుంచి విద్యార్థి వీసా మంజూరుకు కనీసం రూ.16.30 లక్షలు (29,710 ఆస్ట్రేలియన్ డాలర్ల) బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్టు ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. అంతకుముందు 2023 అక్టోబర్‌లో పొదుపు మొత్తాన్ని రూ.11.46 లక్షల నుంచి రూ.13.35 లక్షలు (21,041 ఆస్ట్రేలియన్ డాలర్ల నుంచి 24,505 ఆస్ట్రేలియన్ డాలర్లకు)కు పెంచింది. -
వీసాల రద్దు అన్యాయం
న్యూయార్క్: అధికారులు తమ స్టూడెంట్ వీసాలను అన్యాయంగా రద్దు చేశారంటూ భారతీయ విద్యార్థి సహా నలుగురు అమెరికా కోర్టులో కేసువేశారు. అధికారులు తమను నిర్బంధించి, సొంత దేశాలకు బలవంతంగా పంపించే అవకాశముందని వారు ఆరోపించారు. వీసాలను పొడిగించి, చదువులు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండనివ్వాలని భారత్‌కు చెందిన చిన్మయ్ డియోరా, నేపాల్ వాసి యోగేశ్ జోషి, చైనా విద్యార్థులు జియాంగ్యున్ బు, క్వియువి యంగ్ కోరారు. వీరిలో చిన్మయ్ డియోరా.. వేన్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. హోంల్యాండ్ డిపార్టుమెంట్(డీహెచ్ఎస్), ఇమిగ్రేషన్ అధికారులు తమకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ఆన్లైన్లో స్టూడెంట్ అండ్ ఎక్సే్ఛంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఎస్ఈవీఐఎస్)లో స్టూడెంట్ ఇమిగ్రేషన్ స్టేటస్‌ను రద్దు చేశారని ఆరోపించారు. ఎలాంటి కారణం చూపకుండా, నోటీసు ఇవ్వకుండా ప్రభుత్వం వీసా రద్దు చేయడంపై వీరి తరఫున తాము మిషిగన్ కోర్టులో కేసు వేశామని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్(ఏసీఎల్యూ) తెలిపింది. వీరిపై ఎలాంటి కేసులు లేవని, వలస చట్టాలను వీరు ఉల్లంఘించలేదని పేర్కొంది. ఎఫ్–1 వీసాల రద్దు కారణాలపై సంబంధిత వర్సిటీలకు ఎలాంటి వివరణ కూడా అధికారులు ఇవ్వలేదని తెలిపింది. ట్రాఫిక్ చలాన్లు, రాంగ్ పార్కింగ్, గతంలో అధికారులతో గొడవ పడిన ఘటనలను సాకుగా చూపుతూ విద్యార్థులను బలవంతంగా పంపేయడం తగదని పేర్కొన్నారు. ఇదే అంశంపై న్యూహాంప్‌షైర్, ఇండియానా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. -
వీసా దరఖాస్తు ఫీజులు పెంచిన అమెరికా
న్యూఢిల్లీ: అమెరికాకు వచ్చే వారి టూరిస్ట్, స్టూడెంట్ వీసా దరఖాస్తుల ఫీజును పెంచుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. విజిటర్ వీసాలు, నాన్ పిటిషన్ బేస్డ్ నాన్ ఇమిగ్రాంట్ వీసాల ఫీజును ప్రస్తుతమున్న 160 డాలర్ల నుంచి 185 డాలర్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. అదేవిధంగా, తాత్కాలిక వృత్తిదారులు(టెంపరరీ వర్కర్స్)కిచ్చే కొన్ని రకాల నాన్ ఇమిగ్రాంట్ వీసాల ఫీజు ప్రస్తుతం ఉన్న 190 డాలర్ల నుంచి 205 డాలర్లకు పెరుగుతుందని తెలిపింది. ప్రత్యేక వృత్తినిపుణు(స్పెషలిజం ఆక్యుపేషన్)లకు ఫీజును 315 డాలర్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం మే 30వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ప్రకటించింది. కాన్సులర్ సేవల ఫీజుల్లో ఎటువంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. -
StudentVisaఅమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అదిరిపోయే న్యూస్!
న్యూఢిల్లీ: అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు అదిరిపోయే వార్త. కోర్సు ప్రారంభానికి కంటే ఒక సంవత్సరం ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ టర్మ్ ప్రారంభమయ్యే 365 రోజుల ముందే వీసా జారీ చేయనున్నామని అమెరికా బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ ప్రకటించింది. ఒకవైపు కోర్సులు మొదలు కావడం, మరోవైపు వీసా కేంద్రాలలో 300 రోజుల వరకు వేచి ఉండే సమయంతో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులకు ఈ ప్రకటన భారీ ఊరటనిస్తుంది. యుఎస్‌లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు ఇప్పుడు వీసా కోసం ఒక సంవత్సరం ముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చు కానీ ముందుగానే వీసా పొందిన విద్యార్థులు కూడా వారి ప్రోగ్రామ్ ప్రారంభ తేదీకి 30 రోజుల కంటే ముందు USలోకి ప్రవేశించడానికి అనుమతించబడరు. దీని ప్రకారం ‘ఎఫ్-1 లేదా ఎం’ స్టూడెంట్ వీసాలు ఇప్పుడు I-20 ప్రోగ్రామ్ ప్రారంభ తేదీకి 365 రోజుల ముందుగానే జారీ కానున్నాయి. ఫలితంగా విద్యార్థులు వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ సమయం లభిస్తుందని అని బ్యూరో ఒక ట్వీట్లో పేర్కొంది. అమెరికా యూనివర్సిటీలో చేరబోయే విద్యార్థులు తమ వీసా ఇంటర్వ్యూలను 120 రోజుల ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. అయితే ముందుగానే వీసా పొందినా కూడా ప్రోగ్రామ్ ప్రారంభ తేదీకి 30 రోజుల కంటే ముందు అమెరికాలో ప్రవేశించడానికి అనుమతి ఉండదని తెలిపింది. యుఎస్ ఎంబసీ, కాన్సులేట్లు ఈ సంవత్సరం భారతీయ విద్యార్థుల నుండి రికార్డు స్థాయిలో వీసాలు ఆశిస్తున్నామని ముంబైలోని యుఎస్ కాన్సులేట్ జనరల్‌లోని కాన్సులర్ చీఫ్ జాన్ బల్లార్డ్ తెలిపారు. వీసా అపాయింట్మెంట్ల బ్యాక్‌లాగ్‌ను తగ్గించేందుకు కూడా కసరత్తు చేస్తోంది. వీసా దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేసేలా సంబంధిత సిబ్బందిని పెంచాలని, మొదటిసారి దరఖాస్తు చేసుకున్న వారి కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలను నిర్వహించాలని కూడా యోచిస్తోంది. F and M student visas can now be issued up to 365 days in advance of the I-20 program start date, allowing more time for students to apply for a visa. Students are still not allowed to enter the U.S. on a student visa more than 30 days before their program start date. pic.twitter.com/jHUaNZYkE8 — Travel - State Dept (@TravelGov) February 21, 2023 -
అమెరికా వీసాలు పొందడంలో భారత్ రికార్డు
సాక్షి, హైదరాబాద్: అమెరికా వీసాలు పొందడంలో ఇండియా రికార్డు సృష్టించింది. మిగతా దేశాల కంటే భారతదేశ విద్యార్థులే ఎక్కువ వీసాలు పొందడం గమనార్హం. అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 82 వేల వీసాలు మంజూరు చేసినట్లు ‘ద యూఎస్ మిషన్ ఇన్ ఇండియా’ప్రకటించింది. 2022లో ఈ స్థాయిలో వీసాలు పొందిన మరో దేశం లేదని తెలిపింది. న్యూఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయంతోపాటు చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైల్లోని కార్యాలయాలు కూడా భారతీయ విద్యార్థుల వీసాల జారీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చాయని, మే నుంచి ఆగస్టు వరకూ వీటిని వీలైనంత వేగంగా జారీ చేసే ప్రక్రియ చేపట్టడం వల్ల విద్యార్థులు సకాలంలో అమెరికాలో విద్యాభ్యాసం మొదలు పెట్టే వీలు కలిగిందని వివరించింది. ‘‘కోవిడ్–19 కారణంగా గతేడాది మాది రిగా వీసాల జారీలో జాప్యం జరక్కపోవడం, సకాలంలో విద్యార్థులు యూనివర్సిటీల్లో చేరగలగడం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో 82 వేల వీసాలు జారీ చేయడం భారతీయ విద్యార్థులు అమెరికన్ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతకు చిహ్నం’’అని ఛార్జ్ డి అఫైర్స్ పాట్రీషియా లాసినా తెలిపారు. ‘‘అమెరికా దౌత్య వ్యవహారాల్లో అంతర్జాతీయ విద్యార్థులు కేంద్రస్థానంలో ఉంటారు. భారతీయ విద్యార్థుల భాగస్వామ్యం కూడా చాలా ఎక్కువ’’అని మినిస్టర్ కౌన్సిలర్ డాన్ హెల్ఫిన్ అన్నారు. ఇరవై శాతం మంది భారతీయులే.. అమెరికాలో వేర్వేరు కోర్సుల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో ఇరవై శాతం మంది భారతీయ విద్యార్థులే. ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం 2020–2021లో దాదాపు 1,67,582 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. 2020లో అమెరికన్ ప్రభుత్వం, ఉన్నత విద్యాసంస్థలు కోవిడ్ రక్షణ ఏర్పాట్లు చేయడంతోపాటు విద్యార్థులను ఆహ్వానించాయి. ఆన్లైన్/ఆఫ్‌లైన్ పద్ధతులు రెండింటిలోనూ బోధన ఏర్పాట్లు చేశాయి. ఇదీ చదవండి: వీసాలున్నా వెళ్లలేక.. -
భారత విద్యార్థులకు గుడ్‌న్యూస్.. చైనా కీలక ప్రకటన
బీజింగ్: కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో చైనా నుంచి వందల మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఇక్కడే ఉండిపోయారు. తాజాగా వీసాలపై నిరీక్షణకు తెరదించుతూ భారత విద్యార్థులకు చైనా శుభవార్త అందించింది. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి చైనాకు వెళ్లేందుకు వీసాలు జారీ చేసే ప్రణాళిక చేస్తున్న ప్రకటించింది. స్టూడెంట్ వీసాలతో పాటు బిజినెస్ వంటి వివిధ కేటగిరీల వీసాలు సైతం జారీ చేయనున్నట్లు డ్రాగన్ విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ‘భారత విద్యార్థులకు శుభాకాంక్షలు. మీ సహనం విలువైనదని రుజువైంది. నేను నిజంగా మీ ఉత్సాహాన్ని, సంతోషాన్ని పంచుకోగలను. తిరిగి చైనాకు వచ్చేందుకు స్వాగతం.’ అంటూ ట్వీట్ చేశారు చైనా విదేశాంగ శాఖ ఆసియా వ్యవహారాల కౌన్సెలర్ జి రోంగ్. భారత విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కుటుంబాలకు వర్కింగ్ వీసాల జారీపై న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ వివరణాత్మక ప్రకటనను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ప్రకటన ప్రకారం చైనాలో ఉన్నత విద్య చదవాలనుకుంటున్న కొత్త విద్యార్థులు, చైనా నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు ఎక్స్1 వీసాలు జారీ చేయనున్నారు. కొత్తగా వెళ్లే విద్యార్థులు ఒరిజినల్ అడ్మిషన్ లెటర్‌ను అందించాల్సి ఉంటుంది. మిగిలిన వారు చైనా యూనివర్సిటీల నుంచి అనుమతి పత్రాలను అందించాలి. చైనాలో కరోనా ఆంక్షలతో స్వదేశానికి తిరిగి వచ్చి సుమారు 23వేల మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. రెండేళ్లుగా తిరిగి వెళ్లేందుకు వీసాల కోసం నిరీక్షిస్తున్నారు. చైనాకు తిరిగి వచ్చే విద్యార్థుల వివరాలను అందించాలని ఇటీవలే చైనా కోరింది. దీంతో వందల మంది విద్యార్థుల జాబితాను చైనాకు అందించింది భారత్. సుమారు 1000 మంది పాత విద్యార్థులు చైనాకు తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు.. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన రాకపోకలు లేకపోవటం విద్యార్థులకు ఇబ్బంది కలిగించనుంది. కొద్ది వారాల క్రితం శ్రీలంక, పాకిస్థాన్, రష్యా సహా పలు దేశాలకు చెందిన విద్యార్థులు చార్టెడ్ ఫ్లైట్స్ ద్వారా చైనాకు చేరుకున్నారు. ఇదీ చదవండి: తైవాన్‌లో అమెరికా గవర్నర్ పర్యటన.. చైనా ఎలా స్పందిస్తుందో? -
130 మంది విద్యార్థుల అరెస్టు
వాషింగ్టన్: అమెరికా వీసా మోసం కేసులో 130 మంది విద్యార్థులు అరెస్టయ్యారు. వీరిలో అత్యధికులు భారతీయులే. అధికారులు వల పన్ని ఏర్పాటు చేసిన ఫార్మింగ్టన్ యూనివర్సిటీ నకిలీదని తెలిసినప్పటికీ అమెరికాలో ఉండి అక్రమంగా ఉద్యోగాలు చేసుకునేందుకే ఈ విద్యార్థులంతా ఆ విశ్వవిద్యాలయంలో చేరారని వలస విభాగం అధికారులు ఆరోపణలు నమోదు చేశారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయమే వీరందరినీ అరెస్టు చేశారు. మరికొంత మంది కూడా అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే ఫార్మింగ్టన్ యూనివర్సిటీ చట్టబద్ధమైన రీతిలో పనిచేయడం లేదనే విషయం విద్యార్థులకు తెలియదనీ, చాలా కోర్సులు/యూనివర్సిటీల్లో చదువుతోపాటే ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఇది కూడా నిజమైన యూనివర్సిటీనే అని ఆ విద్యార్థులు భావించారని వారి తరఫు న్యాయవాదులు అంటున్నారు. అధికారులే ఇబ్బందికర పద్ధతుల ద్వారా, వల విసిరి విద్యార్థులను పట్టుకున్నారని లాయర్లు ఆరోపించారు. అమెరికాలో విద్యార్థి వీసాలపై అక్రమంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులను పట్టుకునేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీఈ) అధికారులు పార్మింగ్టన్ పేరుతో నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ వలలో చిక్కిన 8 మంది మధ్యవర్తులు (అందరూ తెలుగు వారే) ఇప్పటికే అరెస్టవ్వగా, తాజాగా 130 మంది విద్యార్థులు కూడా అరెస్టయ్యారు. 8 మందిపై వీసా సంబంధిత నేరపూరిత కుట్ర, లాభం కోసం అన్యులకు ఆశ్రయమివ్వడం తదితర అభియోగాలను నమోదు చేసిన అధికారులు, విద్యార్థులపై మాత్రం కేవలం పౌర వలస నిబంధనల ఉల్లంఘన అభియోగంతో సరిపెట్టారు. అరెస్టైన 130 మంది విద్యార్థుల్లో 129 మంది భారతీయులేనని ఐసీఈ అధికార ప్రతినిధి ఖాలిద్ వాల్స్ చెప్పారు. వారిని భారత్‌కు తిరిగి పంపించేయనున్నామన్నారు. వారికేం తెలియదు: న్యాయవాదులు ఫార్మింగ్టన్ వర్సిటీలో తరగతులు జరగవు, సిబ్బంది ఉండరనే విషయం అందులో చేరిన విద్యార్థులకు ముందే తెలుసుననీ, కేవలం అమెరికాలో ఉండి ఉద్యోగాలు చేసుకోవాలన్న ఉద్దేశంతోనే వారు ఆ యూనివర్సిటీలో చేరారని దర్యాప్తు అధికారులు అంటున్నారు. కానీ ఇలా చదువుతున్నప్పుడే ఉద్యోగాలు చేయడం మామూలే కాబట్టి విద్యార్థులు ఇది కూడా అలాంటిదే అనుకున్నారనీ, ఇందులో వారి తప్పేమీ లేదని విద్యార్థుల తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. మైకేల్ సోఫో అనే న్యాయవాది మాట్లాడుతూ ‘కోర్సులో చేరిన తొలి రోజు నుంచే ప్రయోగాత్మక శిక్షణను ప్రారంభించి, మిగిలిన సమయంలో ఉద్యోగాలు చేసుకునే వర్సిటీలున్నాయి. యూనివర్సిటీకి రాకుండా ఎంతో దూరంలో ఉండి, ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఆ కోర్సులు చేయొ చ్చు. ఇది కూడా అలాంటిదేనని వారు భావించారు’ అని చెప్పారు. రవి మన్నం అనే మరో న్యాయవాది మాట్లాడుతూ ప్రభుత్వమే అభ్యంతరకర, ఇబ్బందికరమైన పద్ధతుల్లో విదేశీ విద్యార్థులను చేర్చుకుందన్నారు. వారికి అక్కడి రాయబార కార్యాలయం, భారత సంఘాలు సాయం అందించే ప్రయత్నాలను ప్రారంభించాయి. -
బ్రిటన్ విద్యార్థి వీసాల ఆశలు ఆవిరి!
టోఫెల్, టోయిక్ పరీక్షలు ఇకపై ఈటీఎస్ నిర్వహించదు న్యూఢిల్లీ: విద్యార్థుల వీసా ఆశలపై నీళ్లు చల్లేలా బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. యూకేలో వీసాల జారీకి సంబంధించి టోఫెల్, టోయిక్ పరీక్షలను ఇకపై ఈటీఎస్(ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్) నిర్వహించడం లేదని ప్రకటించింది. టోయిక్(టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ ఫర్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్) అక్రిడేషన్ కోసం విద్యార్థులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నట్లు ఇటీవల బీబీసీలో కథనం వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈటీఎస్‌తో తమ కాంట్రాక్టు పొడిగించబోమని బ్రిటన్ హోంశాఖ తెలిపింది. ఈటీఎస్ పరీక్షలకు హాజరయ్యే వారు హోం శాఖ ఆమోదించిన ఇతర ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని యూకే అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల మండలి సూచించింది. సహాయం కోసం సంబంధిత విద్యాసంస్థల సలహాదారులను సంప్రదించాలని పేర్కొంది.