
చట్ట ఉల్లంఘనలు, నేరాలకు పాల్పడినందుకు కఠినచర్యలు తీసుకున్న అమెరికా
వాషింగ్టన్: అమెరికా చట్టాలను మీరితే విద్యార్థి వీసాలను రద్దుచేయడం ఖాయమని గతంలోనే స్పష్టంచేసిన ట్రంప్ ప్రభుత్వం అన్నంతపనీ చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తూ, పలురకాల నేరాలకు పాల్పడినందుకు శిక్షగా ఇప్పటిదాకా 6,000 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. ఇతరులపై దాడులు, మద్యం సేవించి వాహనం నడపడం, చోరీలకు పాల్పడటం, ఉగ్రవాదానికి నైతిక మద్దతు పలకడం, ఇతరత్రా చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయిన అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్ వీసాలను రద్దుచేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
అమెరికా చట్టనిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈ ఆరువేల మందిలో దాదాపు 4వేల మంది వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు 300 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. ‘ఇమిగ్రేషన్, నేషనల్ యాక్ట్‌లోని మూడో సెక్షన్ ప్రకారం ఉగ్రవాదానికి మద్దతు ప్చ్ఠ్డలికిన వారి వీసా రద్దు అవుతుంది. పాలస్తీనా అనుకూల, యూదు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న వారి వీసా రద్దు అవుతుంది.

ఉగ్రసంస్థకు అనుకూలంగా వ్యవహరించడం, అమెరికా పౌరులకు ప్రాణహాని కల్పించడం సైతం చట్టాన్ని ఉల్లంఘించే చర్యలుగా అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. జనవరి నుంచి వేలాది మంది విద్యార్థుల వీసాల అపాయింట్‌మెంట్ షెడ్యూలింగ్‌ను అర్థంతరంగా ట్రంప్ ప్రభుత్వం నిలిపివేయడం తెల్సిందే. జూన్‌లో మళ్లీ వీసాల అపాయింట్‌మెంట్లను పునరుద్ధరించినప్పటికీ అభ్యర్థులంతా తమ సోషల్‌మీడియా ఖాతాల వివరాలు అధికారులు తనిఖీ చేసేందుకు వీలుగా ‘పబ్లిక్’మోడ్‌లోనే ఉంచాలని సూచనలు చేయడం తెల్సిందే.