రాత్రి వేళ రోడ్డు పక్కన హెడ్‌ మసాజ్‌..

హీరోయిన్‌ ఓ వెలుగు వెలిగిన చార్మి ఇటీవల నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి చార్మి నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. షూటింగ్‌ వ్యవహారాలను దగ్గర ఉండి చూసుకుంటున్న చార్మి.. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. 

తాజాగా ‘నిర్మాతగా ఉంటే దక్కే ప్రయోజనాలు..’ అంటూ చార్మి ఓ సరదా వీడియోను అభిమానులతో పంచుకున్నారు. రోడ్డు పక్కన రాత్రి వేళ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో.. హెడ్‌ మసాజ్‌ చేయించుకుంటున్న వీడియోను ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆ వీడియోలో చార్మి ఓ వైపు మసాజ్‌ చేయించుకుంటూనే.. మరోవైపు షూటింగ్‌ సీన్‌ గురించి పూరితో మాట్లాడుతూ కనిపించారు. కాగా, ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్‌ ఫైటర్‌గా కనిపిస్తున్న ఈ సినిమాలో.. అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top