క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా రంగస్థలం సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా షూటింగ్ లోకెషన్‌లో జరిగిన ఓ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎప్పుడూ కెమెరా వెనక నిలబడి యాక్షన్, కట్ చెప్పే సుకుమార్ సరదాగా డ్యాన్స్ చేస్తూ సెట్‌లో సందడి చేశాడు. సుకుమార్‌తో పాటు యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్, లక్ష్మణ్‌లు కూడా డ్యాన్స్ చేశారు. తీన్ మార్ బీట్‌కు వీరు చేసిన డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది.