వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ప్రకాశ్‌ రాజ్‌ | I will speak the truth, whenever and wherever: Prakash Raj | Sakshi
Sakshi News home page

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ప్రకాశ్‌ రాజ్‌

Oct 5 2017 3:37 PM | Updated on Mar 22 2024 11:31 AM

ఎప్పుడైనా, ఎక్కడైనా నిజమే మాట్లాడతానని సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తూ ఆయన వ్యాఖ్యలు చేయడంపై లక్నో న్యాయవాది కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసుపై స్పందించి ప్రకాష్ రాజ్ ఎప్పుడైనా, ఎక్కడైనా తాను నిజం మాట్లాడతానని, మోదీ విషయంలోనూ తాను నిజమే మాట్లాడానని అన్నారు. అంతమాత్రానికే తనను యాంటీ మోదీ అనేస్తారా? అని ప్రశ్నించారు. మోదీపై తనకు గౌరవం ఉందన్న అయితే కొన్ని అంశాల్లో తాను మోదీతో ఏకీభవించలేనని చెప్పారు. ఈ విషయంలో తనను నోటికొచ్చినట్లు తిడుతున్న వారు... తనకు ఎదురుగా వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేదని ప్రకాశ్‌ రాజ్‌ విమర్శించారు. ఇంత జరిగినప్పటికీ తన మాటల నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. కాగా ప్రకాశ్‌ రాజ్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement