పండగ వచ్చిందంటే చాలా మంది సోంతూర్లో వాలిపోతుంటారు. అక్కడే వేడుకలను జరుపుకోవడానికి ఇష్టపడుతుంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పండగలను కుటుంబంతో కలిసి పల్లెటూర్లలో జరుపకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దసరా వేడుకలను తన అత్తారింట్లో జరుపుకున్న బన్నీ.. సంక్రాంతిని మాత్రం తన సొంతూర్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన ఫ్యామిలీతో కలిసి సోమవారం రాజమండ్రికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన అభిమానులు రాజమండ్రి నుంచి పాలకొల్లు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.