దేశం గర్వించదగ్గ విజయాలు సాధించిన టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’ పురస్కారానికి ఎంపికైంది. బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ కిడాంబి శ్రీకాంత్, రోలర్ స్కేటింగ్ ప్లేయర్ అనూప్ కుమార్ యామా ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డులను దక్కించుకున్నారు. ఈ మేరకు పురస్కారాల కమిటీ వీళ్ల పేర్లను కేంద్ర క్రీడాశాఖకు సిఫారసు చేసింది. ఇక క్రీడాశాఖ అధికారికంగా ప్రకటించడం లాంఛనమే కానుంది. జాబితాను ఆమోదించిన తర్వాత ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఆటగాళ్లకు ఈ అవార్డులను అందజేస్తారు. క్రికెటర్ రోహిత్ శర్మతో పాటు మరో 14 మందిని కూడా అర్జున అవార్డుకు ప్రతిపాదించారు.