గత కొద్ది రోజులుగా పీవీ సింధు అద్భుతంగా ఆడుతోందని, ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ లో ఆమె ఆటతీరు తాను గర్వించేలా ఉందని కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. సింధు వెండి పతకం సాధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... కోర్టులో ఆమె కదిలిన తీరు, పోరాట పటిమ నిరుపమానమని కొనియాడాడు.