భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మరోసారి కలిసి పని చేయనున్నారు. మూడేళ్ల క్రితం అభిప్రాయ భేదాల కారణంగా గోపీచంద్‌తో విడిపోయిన సైనా... బెంగళూరులో కోచ్ విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ గోపీచంద్ అకాడమీలో కోచింగ్‌కు ఆమె సన్నద్ధమైంది.