ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఉషారాణి చనిపోయి ఒకరోజు గడవక ముందే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే రోజా శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...