ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాలకు తావీస్తోందని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబును ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరన్న కేసీఆర్... 14 నెలలు అయినా ఆ కేసులో అనుబంధ ఛార్జిషీట్ వేయకపోవడం దేనికి నిదర్శనమన్నారు. ఉన్నపళంగా విజయవాడకు చంద్రబాబు నాయుడు పారిపోవడం వెనుక పెద్ద కథే నడిచిందని భూమన అన్నారు. కేసు నుంచి బయటపడేందుకు కేసీఆర్ కు రూ.500 కోట్లు చెల్లించడమే కాకుండా, ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని భూమన విమర్శించారు.
Aug 29 2016 4:39 PM | Updated on Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement