విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సభ మంగళవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రత్యేక హోదా కోసం పోరాడిన విద్యర్థులను అరెస్ట్ చేయడం అమానుషమని సభలో వైఎస్ఆర్ సీపీ కార్పోరేటర్లు స్పష్టం చేశారు. ఇంతలో సభ సజావుగా జరిగేలా చూడాలంటూ మేయర్ సదరు సభ్యులకు విజ్ఞప్తి చేశారు.