తన వల్లే పీవీ సింధుకు ఒలింపిక్స్ లో పతకం వచ్చిందని సీఎం చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకొంటున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ఆయనకు ఎంతసేపూ పబ్లిసిటీ పిచ్చేనా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణ నదికి పుష్కరాలు తానే తీసుకొచ్చానని, పుష్కరాలను తానే సాగనంపుతానని చంద్రబాబు చెప్పుకొంటున్నారని, ఆయన పబ్లిసిటీ స్టంట్లు మితిమీరిపోయాయని విమర్శించారు.