ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం నివేదిక మాయం | world-bank-inspection-team-report-was-missing | Sakshi
Sakshi News home page

ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం నివేదిక మాయం

Oct 10 2017 7:01 AM | Updated on Mar 21 2024 9:01 PM

ప్రపంచ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఏపీ రాజధాని ప్రాంతంపై తనిఖీ బృందం నివేదిక మాయం అయింది. ఆదివారం రాత్రి వరకు వెబ్‌సైట్‌లో తనిఖీ బృందం సిఫార్సులతో కూడిన నివేదిక అందుబాటులో ఉండింది. సోమవారం ఉదయం నుంచి అది కనిపించడం లేదు. ప్రభుత్వ పెద్దలే ఢిల్లీలోని ప్రపంచ బ్యాంకు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి తనిఖీ బృందం నివేదికను వెబ్‌సైట్‌ నుంచి తీయించారని అధికార వర్గాలు, రాజధాని ప్రాంత రైతులు అభిప్రాయపడుతున్నారు. తనిఖీ బృందం పూర్తి స్థాయి నివేదిక అందుబాటులో ఉంటే ప్రభుత్వం చెబుతున్న అంశాలకు, తనిఖీ బృందం పేర్కొన్న అంశాల మధ్య వ్యత్యాసాలు, వాస్తవ పరిస్థితులు అందరికీ తెలిసిపోతాయని, తద్వారా అంతర్జాతీయంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఒత్తిడి తెచ్చి తొలగించారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement