తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు మద్దూరులో పెద్ద అవమానమే జరిగింది. హెలికాప్టర్ పైలట్ పొన్నాల మాట వినిపించుకోలేదు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పొన్నాలను ఎక్కించుకోకుండానే పైలట్ హదరాబాద్ వెళ్లిపోయారు. ఇంతకీ అసలు జరిగిందేంటంటే.... ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నాల లక్ష్మయ్య హెలీకాఫ్టర్ లో మద్దూరు వెళ్లారు. అక్కడ పర్యటన ముగించుకున్న తరువాత వరంగల్ రావాలని పొన్నాల పైలట్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్ లో వరంగల్ లేదని, తాను రానని పైలట్ చెప్పారు. ఈ సందర్భంగా పైలట్ తో పొన్నాల వాదనకు దిగారు. పైలట్ తన మాట వినకపోవడంతో ఆయన చిందులు వేశారు. నిబంధనలు ఉల్లంఘించలేనని పైలట్ తెగేసి చెప్పారు. చివరకు పొన్నాలను ఎక్కించుకోకుండానే పైలట్ హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇక చేసేదేమీలేక పొన్నాల కారులో వరంగల్ బయలుదేరారు.
Apr 22 2014 7:47 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement